అందుకే తప్పుకున్నా | Allu Sirish not a part of Suriya-KV Anand film | Sakshi
Sakshi News home page

అందుకే తప్పుకున్నా

Published Sat, Jul 21 2018 12:46 AM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM

Allu Sirish not a part of Suriya-KV Anand film - Sakshi

అల్లు శిరీష్‌

దర్శకుడు కేవీ ఆనంద్, హీరో సూర్య కాంబినేషన్‌లో రూపొందనున్న ఓ చిత్రంలో అల్లు శిరీష్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని చిత్రబృందం పేర్కొంది. ఈ పాత్ర కోసం ప్రిపరేషన్‌ కూడా స్టార్ట్‌ చేశానని ఆ మధ్య శిరీష్‌ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి అల్లు శిరీష్‌ తప్పుకున్నారు. ‘‘ సూర్య, కేవీ ఆనంద్‌గారి సినిమాకు,  ‘ఏబీసిడీ’ సినిమాకు డేట్స్‌ అడ్జస్ట్‌ విషయంలో క్లాష్‌ వచ్చింది.

రెండు సినిమాల గురించి ఆలోచించి నా అంతట నేను ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కేవీ ఆనంద్‌గారు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని నా నిర్ణయాన్ని గౌరవించారు. ఈ సినిమాలో భాగం కావాలని ఎంతో అనుకున్నాను. కానీ కుదర్లేదు. ఈ అవకాశాన్ని ఇచ్చిన కేవీ ఆనంద్‌గారికి, సూర్యగారికి, లైకా ప్రొడక్షన్స్‌కు కృతజ్ఞతలు. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఈ టీమ్‌తో కలసి వర్క్‌ చేయాలనుకుంటున్నాను’’ అని శిరీష్‌ అసలు కారణం చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement