'ఆ సినిమాలో తాప్సీ లేదు' | Taapsee Pannu not part of Nikhil Siddhartha's next | Sakshi
Sakshi News home page

'ఆ సినిమాలో తాప్సీ లేదు'

Published Tue, Mar 15 2016 12:23 PM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

'ఆ సినిమాలో తాప్సీ లేదు'

'ఆ సినిమాలో తాప్సీ లేదు'

చెన్నై: నిఖిల్ హీరోగా రానున్న కొత్త సినిమాలో మూడో హీరోయిన్గా తాప్సీ నటించనున్నట్టు వచ్చిన వార్తలను ఆ చిత్రం దర్శకుడు వీఐ అనంద్ ఖండించాడు.  తెలుగు రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.  ఈ చిత్రంలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లుగా అవికా గోర్, హేబా పటేల్ లు ఎంపిక చేయగా, మూడో హీరోయిన్ కోసం వెతుకుతున్నామని చిత్రం దర్శకుడు ఆనంద్ తెలిపాడు.

అయితే వారంలోపు ఆ  హీరోయిన్ ఎవరు అనేది నిర్ణయిస్తామని మీడియాకు వెల్లడించాడు. ప్రేమకథనంతో సాగే ఈ చిత్రంలో కొన్ని ఫాంటసీ అంశాలు ఉంటాయని అన్నాడు. నిఖిల్ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని డైరెక్టర్ ఆనంద్ పేర్కొన్నాడు. ఈ చిత్రానికి హీరో నిఖిల్ సరిగ్గా సరిపోతాడని చెప్పాడు. కాగా,  దర్శకుడిగా వీఐ ఆనంద్ చేస్తున్న ఈ చిత్రానికి నిర్మాతగా వెంకటేశ్వరరావు వ్యవహరిస్తుండగా, శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement