Director VI Anand
-
ఆ స్ఫూర్తితోనే ఈ కథ రాశాను
‘‘సూపర్ నేచురల్ ఫ్యాంటసీ జోనర్లో ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా రూపొందింది. మనిషి చనిపోయిన తర్వాత 11 రోజులు ఆత్మ తాలూకు ప్రయాణం ఎలా ఉంటుందన్నది గరుడ పురాణంలో చదివాను. ఆ స్ఫూర్తితో ఈ చిత్రకథ రాశాను. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని డైరెక్టర్ వీఐ ఆనంద్ అన్నారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమా ఈ 16న రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వీఐ ఆనంద్ పంచుకున్న విశేషాలు. ► సందీప్ కిషన్‌కి రెండు ఐడియాలు చెబితే ‘ఊరు పేరు భైరవకోన’ కథకు ఎగ్జయిట్ అయ్యాడు. నాకు కూడా ఈ కథ చేస్తే చాలా కొత్తగా ఉంటుంది, ఒక ట్రెండ్ సెట్ చేసేలా ఉంటుందని ఫిక్స్ అయ్యాం. రాజేశ్ దండా ఈ కథ వినగానే ఎగ్జయిట్ అయ్యారు. సందీప్, నా మంచి కోరే అనిల్ సుంకరగారు కూడా ఈప్రాజెక్ట్‌లోకి రావడంతో ఈ సినిమాప్రారంభమైంది. బిగ్ స్క్రీన్‌పై విజువల్, సౌండ్ పరంగా ఆడియన్స్‌కి గొప్ప అనుభవాన్ని ఇచ్చే సినిమా ఇది. ► ఈ చిత్రకథలో కర్మ సిద్ధాంతం, గరుడపురాణం, శివదండం.. వంటి నేపథ్యాలు ఉన్నాయి కాబట్టి ‘ఊరు పేరు భైరవకోన’ యాప్ట్ అనిపించి ఆ టైటిల్ ఫిక్స్ చేశాం. ‘టైగర్’ టైమ్‌లో ఉన్న ఫైర్, ప్యాషన్ సందీప్‌లో ఇప్పుడూ ఉన్నాయి. ప్రతి సినిమాని తొలి సినిమాలానే చేస్తున్నాడు. నా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌తో వస్తున్న సినిమా ఇది. ► నేను గతంలో అల్లు అర్జున్‌తో ఓ సినిమాతో పాటు, గీతా ఆర్ట్స్‌లో ఓ మూవీ చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. ప్రస్తుతం హీరో నిఖిల్‌తో ఓ సినిమా చర్చల్లో ఉంది. అలాగే ఓ పెద్ద హీరోకి యాక్షన్ కథ రాస్తున్నాను. -
డేట్ ఫిక్స్
హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. చివరి దశకు చేరుకున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు గురువారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘‘ఊరు పేరు భైరవకోన’లో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర. -
'ఆ సినిమాలో తాప్సీ లేదు'
చెన్నై: నిఖిల్ హీరోగా రానున్న కొత్త సినిమాలో మూడో హీరోయిన్గా తాప్సీ నటించనున్నట్టు వచ్చిన వార్తలను ఆ చిత్రం దర్శకుడు వీఐ అనంద్ ఖండించాడు. తెలుగు రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఈ చిత్రంలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లుగా అవికా గోర్, హేబా పటేల్ లు ఎంపిక చేయగా, మూడో హీరోయిన్ కోసం వెతుకుతున్నామని చిత్రం దర్శకుడు ఆనంద్ తెలిపాడు. అయితే వారంలోపు ఆ హీరోయిన్ ఎవరు అనేది నిర్ణయిస్తామని మీడియాకు వెల్లడించాడు. ప్రేమకథనంతో సాగే ఈ చిత్రంలో కొన్ని ఫాంటసీ అంశాలు ఉంటాయని అన్నాడు. నిఖిల్ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని డైరెక్టర్ ఆనంద్ పేర్కొన్నాడు. ఈ చిత్రానికి హీరో నిఖిల్ సరిగ్గా సరిపోతాడని చెప్పాడు. కాగా, దర్శకుడిగా వీఐ ఆనంద్ చేస్తున్న ఈ చిత్రానికి నిర్మాతగా వెంకటేశ్వరరావు వ్యవహరిస్తుండగా, శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూరుస్తున్నారు. -
మరిచిపోలేని అనుభవం!
‘‘ ‘అలా ఎలా’ సినిమా హిట్‌తో నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే జాగ్రత్తగా స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటున్న టైమ్‌లో ‘టైగర్’ కథ చెప్పారు ఈ చిత్ర దర్శకుడు వీఐ ఆనంద్. ఇందులో హీరోకు తగ్గ పాత్ర నాది’’ అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘టైగర్’ చిత్రంలో సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ కలిసి నటించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... ‘‘ఇద్దరు ప్రాణస్నేహితులు, ఓ అమ్మాయి మధ్య సాగే సినిమా ఇది. ఇందులో నా పాత్ర పేరు విష్ణు. స్నేహం, ప్రేమ కోసం ఏదైనా చేసే పాత్ర నాది. ఈ సినిమా గురించి మొదట సందీప్ కిషన్ నాతో చెప్పాడు. కథ వినగానే ఓకే చెప్పేశాను. అలాగే కెమెరామ్యాన్ ఛోటా కె నాయుడుతో వర్క్ చేయడం మరచిపోలేని అనుభవం. ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నా. మహేశ్‌బాబు నా ఫేవరెట్ హీరో. ఆయనే నన్ను ఆ సినిమాకు రికమెండ్ చేశారట. ఆ విషయం దర్శకుడు కొరటాల శివ చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఇవి కాక ‘సెగ’ డెరైక్టర్ అంజన తెరకెక్కిస్తున్న తమిళ చిత్రంలోనూ నటిస్తున్నా. ఆ సినిమాను తెలుగులో విడుదల చేస్తేనే ఒప్పుకుంటానని చెప్పాను. ఎందుకంటే, ప్రస్తుతం నా దృష్టి అంతా తెలుగు సినిమాల మీదే’’ అన్నారు.