ప్రభుదేవా కాంతాలో తమన్నా! | Tamanna in Prabhu Deva's Horror Film | Sakshi
Sakshi News home page

ప్రభుదేవా కాంతాలో తమన్నా!

Published Fri, Apr 1 2016 3:50 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

ప్రభుదేవా కాంతాలో తమన్నా! - Sakshi

ప్రభుదేవా కాంతాలో తమన్నా!

 ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా కథానాయకుడుగా నటించి చాలా కాలమైంది. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు కెళ్లి అక్కడ ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా తన చిత్రాల్లో అతిథి పాత్రల్లో మాత్రమే మెరిసేవారు. ఇక తమిళ తెరపై ఆయన నల్లపూస అయ్యారనే చెప్పాలి.అలాంటి ప్రభుదేవా తాజాగా మళ్లీ తమిళ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించడం ఇక్కడి ఆయన అభిమానులకు సంతోషకరమైన విషయమే.
 
  ప్రభుదేవా ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తి వినోదన్ చిత్రంతో పాటు ప్రభుదేవా హీరోగా భోగన్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాటితో పాటు తను హీరోగా మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటి తమన్న నాయకిగా నటిస్తున్నారు. దీనికి ఏఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
 
  ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం హారర్ ఇతివృత్తంతో రూపొందుతోంది. అయితే దీనికి ఇప్పుడు కాంత అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారక పూర్వకంగా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement