తమన్నా ఔట్‌.. సంచలన కామెంట్స్‌ | Tamanna Simhadri Eliminated From Bigg Boss 3 Telugu | Sakshi
Sakshi News home page

హౌస్‌మేట్స్‌పై తమన్నా సంచలన కామెంట్స్‌

Published Sun, Aug 11 2019 10:46 PM | Last Updated on Mon, Aug 12 2019 4:15 PM

Tamanna Simhadri Eliminated From Bigg Boss 3 Telugu - Sakshi

అంతా ఊహించినట్టే.. సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగినట్టే బిగ్‌బాస్‌ షో నడుస్తోంది. ఈ షోలో ఎవరు ఎలిమినేట్‌ కానున్నారో ముందే లీకవుతూ వస్తోంది. మూడో వారంలో తమన్నా ఇంటి నుంచి బయటకు వెళ్లనుందని శనివారం నుంచే ప్రచారం జరిగింది. అనుకున్నట్లే తమన్నా మూడో కంటెస్టెంట్‌గా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్‌తో ఆట ఆడించడం, వెన్నెల కిషోర్‌ ఎంట్రీ ఇవ్వడం.. హౌస్‌మేట్స్‌ గురించి వివరించడం..  హైలెట్‌గా నిలిచాయి. (బిగ్‌బాస్‌.. తమన్నా అవుట్‌!)

శనివారం నాటి ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్‌ను గడగడలాడించిన నాగ్‌.. ఆదివారం నాడు ఆటలాడించాడు. అంకితం నీకే అంకితం అనే ఆటను హౌస్‌మేట్స్‌తో ఆడిస్తూ ఎంటర్‌టైన్‌ చేశాడు. బిగ్‌బాస్‌ ఇచ్చిన ఓ పాటను హౌస్‌మేట్స్‌లో ఎవరో ఒకరికి డెడికేట్‌ చేయాలని తెలిపాడు. ముందుగా శ్రీముఖి వచ్చి ఓ కార్డ్‌ను సెలెక్ట్‌ చేసుకోగా అందులో పంతం నీదా నాదా సై పాట రాగా.. అది రాహుల్‌కు అంకితం చేస్తున్నట్లు తెలిపింది. తరువాత శివజ్యోతి తనకు వచ్చిన మౌనంగానే ఎదగమని సాంగ్‌ను అలీరెజాకు అంకితం ఇచ్చింది. ఒక్క మగాడు సాంగ్‌ను బాబా భాస్కర్‌.. తమన్నాకు, ఓ సక్కనోడా సాంగ్‌ను పునర్నవి.. రవికృష్ణకు, నువ్వు విజిలేస్తే సాంగ్‌ను హిమజ.. బాబా భాస్కర్‌కు, కన్నుల్లో నీరూపమే సాంగ్‌ను వరుణ్‌ సందేశ్‌.. వితికాకు అంకితం ఇచ్చాడు. ఒక వేళ వితికా అక్కడ లేదంటే ఆ పాటను ఎవరికి అంకితం చేస్తావని నాగ్‌ అడగ్గా.. రాహుల్‌కు అంకితమిస్తానన్నాడు. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే సాంగ్‌ను రాహుల్‌.. రోహిణికి, గోవిందా గోవిందా సాంగ్‌ను అషూ రెడ్డి.. వితికాకు అంకితమిచ్చింది. అనంతరం ఎలిమినేషన్‌లోంచి రాహుల్‌ సేఫ్‌ అయినట్లు తెలిపాడు.

లుక్‌ ఎట్‌ మై ఫేస్‌ ఇన్‌ ది మిర్రర్‌ అనే పాటను రవికృష్ణ.. అలీరెజాకు, దొంగ దొంగ వచ్చాడే సాంగ్‌ను రోహిణి.. బాబా భాస్కర్‌కు, నాలో నేను లేనే లేను అనే పాటను వితికా.. శివజ్యోతికి, నీ దూకుడు సాటెవ్వరూ అనే పాటను అలీరెజా.. రవికృష్ణకు, మగాళ్లు ఒట్టిమాయగాళ్లే అనే పాటను తమన్నా.. రవికృష్ణకు, అమ్మ బ్రహ్మదేవుడో సాంగ్‌ను మహేష్‌.. పునర్నవికి అంకితమిచ్చాడు. దీంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. ఎక్కడో ఎవరికో కాలుతోంది అని రాహుల్‌ను ఉద్దేశించి నాగ్‌ సెటైరిక్‌గా అన్నారు. అనంతర పునర్నవిని సేఫ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు. 

హౌస్‌మేట్స్‌తో వెన్నెల కిషోర్‌ సందడి
వెన్నెల కిషోర్‌ అతిథిగా వచ్చి.. ఇంటి సభ్యుల గురించి.. బయట తమకున్న ఫాలోయింగ్‌ గురించి వివరించాడు. పునర్నవి విషయంలో రాహుల్‌నుద్దేశించి పులిహోర రెసిపి అంటూ పేర్కొన్నాడు. శ్రీముఖికి తమ ఇంట్లోనే ఫ్యాన్స్‌ ఉన్నారని వెన్నెల కిషోర్‌ తెలిపాడు. పునర్నవి, హిమజకు సూపర్‌ ఫాలోయింగ్‌ ఉందని వివరించాడు. ప్రేమతో హగ్‌ చేసుకుంటే అలా తోసేయ్యకు అంటూ వరుణ్‌కు, మంచి తనానికి మారు పేరు రవి అని,  అషూ రెడ్డి స్మైల్‌కు ఫ్యాన్స్‌ ఉన్నారని ఇలా హౌస్‌మేట్స్‌ గురించి వివరించాడు. అనంతరం బాబా భాస్కర్‌ సేఫ్‌ అయినట్టు వెన్నెల కిషోర్‌ ప్రకటించాడు.

ఇక మిగిలిన ఇద్దరిలో తమన్నా ఎలిమినేట్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు. బయటకు వచ్చిన తమన్నా.. మిగిలిన హౌస్‌మేట్స్‌ అందరి గురించి తన అభిప్రాయాలను తెలిపింది. వరుణ్‌ సందేశ్‌ మంచి వాడని కానీ, పక్కవారి మాటలు వింటాడని తెలిపింది. శ్రీముఖి ఆడపులి అని, హిమజ లవ్లీ లేడీ అని,  పునర్నవి స్ట్రాంగ్‌ లేడీ అని కాకపోతే పక్కవారి మాటలకు ప్రభావితం అవుతుందని, అషూ గుడ్‌లేడీ అయితే అప్పుడప్పుడు టాస్క్‌లో కూడా పార్టిపిసేట్‌ చేయాలని సలహా ఇచ్చింది. రాహుల్‌కు ఆడవారికి గౌరవం ఇవ్వడం తెలీదని, రవికృష్ణను హీరోలా చూడాలనుకుంటున్నానని తెలిపింది. రోహిణిలాంటి వారు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండకూడదని బయటి ఫ్రెండ్‌షిప్‌లే ఇక్కడ కూడా చూపిస్తుందని తెలిపింది. శివజ్యోతికి ఏది చెప్పినా చెడుగానే తీసుకుంటుందని, వితికా మంచిదే కాని కారాలు మిర్యాలు నూరుతుందని, రాహుల్‌ మాటలకు ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతుందని పేర్కొంది. బాబా భాస్కర్‌ తనకు తల్లి, తండి, గురువు లాంటి వాడంటూ కన్నీరు కార్చింది. మొదటి వారంలో చూసినట్లు మహేష్‌ ప్రస్తుతం లేడని, పబ్లిక్‌ తన వెంట ఉన్నారని, తన ఆట తనను ఆడమని మహేష్‌కు సలహా ఇచ్చింది.

పండును మర్చిపోయిన నాగ్‌
బిగ్‌బాస్‌ షో ప్రారంభం నుంచి తన మ్యానరిజంలో భాగంగా పండు(కోతి బొమ్మ)ను చేతి వేళ్లకు తొడుక్కుని వస్తున్నాడు. అయితే దాన్ని మధ్యలో వదిలేయడం కూడా జరగుతూ వచ్చింది. నాగ్‌ ఎపిసోడ్‌మధ్యలో పండుతో ముచ్చటించడం.. హౌస్‌మేట్స్‌ కూడా పండుతో మాట్లాడటం జరుగుతూనే ఉంది. అయితే నాగ్‌ వేలికి అప్పుడప్పుడు ఆ బొమ్మ ఉండదు. ఈ విషయాలను కూడా నెటిజన్లు ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. అయితే ఆదివారం ఎపిసోడ్‌లో పండు మొత్తానికే కనిపించలేదు. మరి పండు ఎక్కడికి వెళ్లిందో.. మళ్లీ వస్తుందో లేదో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement