పెటాకు సూర్య నోటీసులు | Tamil star Suriya issues legal notice to PETA | Sakshi
Sakshi News home page

పెటాకు సూర్య నోటీసులు

Jan 21 2017 2:36 PM | Updated on Sep 5 2017 1:46 AM

పెటాకు సూర్య నోటీసులు

పెటాకు సూర్య నోటీసులు

తమిళనాట జల్లికట్టు వివాదం మరో మలుపు తిరిగింది. తమిళ సాంప్రదాయ క్రీడకు తమిళ సినీ పరిశ్రమ ముక్తకంఠంతో మద్దతు తెలుపుతున్నారు.

తమిళనాట జల్లికట్టు వివాదం మరో మలుపు తిరిగింది. తమిళ సాంప్రదాయ క్రీడకు తమిళ సినీ పరిశ్రమ ముక్తకంఠంతో మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో హీరో సూర్య మరో అడుగు ముందుకు వేసి జల్లికట్టు నిషేదానికి కారణమైన పెటా సంస్థకు నోటీసులు పంపాడు. పెటా సభ్యులు చేసిన వ్యాఖ్యల వల్ల తనకు కలిగిన మానసిక వేదన, ఒత్తిడి క్షమాపణలు డిమాండ్ చేశాడు సూర్య.

సూర్య తరుపున ఆయన పర్సనల్ లాయర్ ఆర్ విజయ్ ఆనంద్, ఓ ప్రకటన చేశారు. సూర్య గతంలోనూ చాలా సార్లు జల్లికట్టుకు మద్దతు పలికారని.. సింగం 3 సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగానే సూర్య జల్లికట్టుకు మద్దతు తెలిపారన్న వాదనలో నిజం లేదన్నారు. ఇలాంటి చీప్ పబ్లిసిటీ సూర్యకు అవసరం లేదని పేర్కొన్నారు.  ఈ మేరకు పెటా ఇండియా సీఈఓ ప్రూవ జోషిపురతో పాటే మరో ఇద్దరికి నోటీసులు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement