వంశీగారి సినిమాలు చూస్తే మా ఊళ్లో తిరిగినట్టే ఉంటుంది : వీవీ వినాయక్
వంశీగారి సినిమాలు చూస్తే మా ఊళ్లో తిరిగినట్టే ఉంటుంది : వీవీ వినాయక్
Published Tue, Jan 7 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
‘‘వంశీగారి సినిమాలు చూస్తే మా ఊళ్లో తిరిగినట్టే ఉంటుంది. ఆయన తీసిన చిత్రాల్లో ‘ఏప్రిల్ 1 విడుదల’ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాను ఇప్పటికీ చూస్తుంటాను. ఆయన ఏ సంగీత దర్శకునితో చేసినా, అందులో వంశీగారి మార్క్ కనిపిస్తుంది. ఇళయరాజా తర్వాత చక్రి సంగీతం వంశీగారికి బాగా కుదిరింది’’ అని వీవీ వినాయక్ చెప్పారు. వంశీ దర్శకత్వంలో రూపొందిన 25వ చిత్రం ‘తను మొన్నే వెళ్లిపోయింది’’ అజ్మల్, నిఖితా నారాయణ్ జంటగా పూర్ణానాయుడు నిర్మించిన ఈ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో వినాయక్ చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్భంగా చక్రి మాట్లాడుతూ -‘‘నా అదష్ట సంఖ్య ఆరు. వంశీగారితో నాకిది ఆరో సినిమా. వంశీగారి సినిమా అంటే భారీ అంచనాలుంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది’’ అన్నారు. హీరోగా తనకిది తొలి తెలుగు సినిమా అని అజ్మల్ చెప్పారు. తనను అచ్చమైన తెలుగమ్మాయిలా చూపించారని నిఖితా నారాయణ్ సంతోషం వెలిబుచ్చారు. ఈ వేడుకలో కుమార్ చౌదరి, మల్టీడెమైన్షన్ వాసు, నందినీ రెడ్డి, పుప్పాల రమేష్, హర్షవర్థన్, మేర్లపాక గాంధీ, క్రాంతి మాధవ్, వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement