
తాప్సీ
పురుష ప్రపంచం అని కొన్ని రంగాల్లో ఉంటుంది. ఉదాహరణకు కల్పనా చావ్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టక ముందు వరకూ ‘స్పేస్’ అనేది పురుష ప్రపంచంగా ఉండేది. అలాగే గుర్రపు స్వారీ కూడా. గుర్రాన్ని దౌడు తీయించే శక్తి, సామర్థ్యాలు మగవాళ్లకే ఉంటాయనే భావన ఉండేది. రూపా సింగ్ ఈ ఫీలింగ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టారు. మహిళ తలచుకుంటే ఏ స్పేస్‌లోకైనా వెళ్లగలదని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే భారత తొలి మహిళా హార్స్ జాకీ రూపాసింగ్ జీవితం వెండితెరకు రానుంది.తాప్సీతో ‘నామ్ షబానా’ చిత్రాన్ని తెరకెక్కించిన శివమ్ నాయర్ ఈ సినిమాకి దర్శకుడు. రూపా జీవితాన్ని సిల్వర్ స్క్రీన్ మీద చూపించడానికి హక్కులు దక్కించుకున్న శివమ్ ఇప్పుడు ఫుల్ స్క్రిప్ట్ రాసే పనిమీద ఉన్నారు. రూపా సింగ్ పాత్రకు తాప్సీయే కరెక్ట్ అనిపించి, స్టోరీ లైన్ చెప్పారట కూడా. హార్స్ రైడింగ్ అనేది పూర్తిగా మగవాళ్ల ఉద్యోగం అనే పరిస్థితుల్లో రూపాసింగ్ ధైర్యంగా ఈ ఉద్యోగంలో దౌడు తీశారు.
మగవాళ్లకు దీటుగా కొనసాగడానికి ఆమె చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇక తాప్సీ విషయానికి వస్తే.. ముందు గ్లామరస్ రోల్స్ చేసిన ఆమె తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ, దూసుకెళుతున్నారు. ‘తాప్సీ మంచి నటి కాదు. అందగత్తె కాదు’ అనే విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పింక్, నామ్ షబానా, బద్లా, గేమ్ ఓవర్ వంటి మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేస్తూ, ముందుకెళుతోన్న తాప్సీ హార్స్‌జాకీ పాత్రకు న్యాయం చేస్తారని చెప్పొచ్చు.