మాజీ ప్రియుడికి దిమ్మతిరిగే జవాబు! | Taylor Swift just got the last word | Sakshi
Sakshi News home page

మాజీ ప్రియుడికి దిమ్మతిరిగే జవాబు!

Published Wed, Feb 17 2016 11:58 AM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

మాజీ ప్రియుడికి దిమ్మతిరిగే జవాబు!

మాజీ ప్రియుడికి దిమ్మతిరిగే జవాబు!

ప్రతిష్టాత్మకమైన గ్రామీ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ప్రఖ్యాత పాప్ గాయని టైలర్ స్విఫ్ట్‌ ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నది. మాజీ ప్రియుడు కెన్యే వెస్ట్‌ తన పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు చాలా హుందాగా సమాధానమిచ్చింది. ఆదివారం జరిగిన గ్రామీ పురస్కారాల ప్రదానోత్సవంలో వరుసగా రెండో ఏడాది ఉత్తమ ఆల్బం అవార్డును టైలర్ స్విఫ్ట్ అందుకుంది.

ఈ సందర్భంగా 'బ్యాడ్ బ్లడ్' సింగర్ మాట్లాడుతూ 'ఆల్బం ఆఫ్ ది ఇయర్ అవార్డును రెండుసార్లు అందుకున్న మొదటి మహిళ అవ్వడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా యువతులకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు విజయాలు సాధించినప్పుడు, పేరు ప్రఖ్యాతలు పొందినప్పుడు వాటిని తగ్గించి చూపేందుకు ఎప్పుడూ కొందరు ఉండనే ఉంటారు. కానీ మీరు మీ పని మీదే దృష్టిపెట్టండి. మిమ్మల్ని పక్కదారి పట్టించాలనుకునేవారిని పట్టించుకోకుండా ముందుకుసాగండి. మీ దారిలో మిమ్మల్ని ప్రేమించేవారు వెంట ఉంటారు' అని స్విఫ్ట్ పేర్కొంది. ఈ ప్రసంగంలో తన మాజీ ప్రియుడు వెస్ట్ పేరును పేర్కొననప్పటికీ అతడు చేసిన అసభ్య వ్యాఖ్యలకు దీటుగా సమాధానమిచ్చింది.

గతవారం మాదిసన్ స్క్వేర్ గార్డెన్ లో సంగీత ప్రదర్శన ఇస్తూ పాప్ సింగర్ వెస్ట్‌ 'ఫేమస్‌' పాటను పాడాడు. 'టైలర్.. నేనూ శృంగారంలో పాల్గొనవచ్చు. ఎందుకంటే ఆ దుష్టురాలిని ఫేమస్ చేసింది నేనే' అంటూ ఓ చరణాన్ని టైలర్‌ను ఉద్దేశించి అతను పాడాడు. అతని చర్యపై ఇన్నిరోజులు మౌనంగా ఉన్న టైలర్ స్విఫ్ట్‌ తన తాజా ప్రసంగంలో దీటుగా బదులిచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement