![Telangana CM K Chandra Sekhar Rao Condolences to Venu Madhav - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/25/Venu-Madhav_99.jpg.webp?itok=U6evUjcl)
ప్రముఖ సినీ హాస్యనటుడు, మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్ తన నటనతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేణు మాధవ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వేణు మాధవ్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన కృష్టి పట్టుదలే కారణమన్నారు తలసాని.
Comments
Please login to add a commentAdd a comment