విజయ్ సేతుపతితో తమన్న రొమాన్స్ | thamanna romance to vijay sethupathi | Sakshi
Sakshi News home page

విజయ్ సేతుపతితో తమన్న రొమాన్స్

Published Wed, Dec 16 2015 3:28 AM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

విజయ్ సేతుపతితో  తమన్న రొమాన్స్

విజయ్ సేతుపతితో తమన్న రొమాన్స్

 ఒకప్పుడు ప్రముఖ నాయికలు యువ నటులతో నటించడానికి సంకోచించేవారు.అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. కారణం విజయాలే కావచ్చు. ఆ మధ్య శివకార్తికేయన్‌తో క్రేజీ నటి హన్సిక మాన్‌కరాటే చిత్రంలో నటించింది. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. ఇటీవల సంచలన నటి నయనతార వర్ధమాన నటుడు ఆరితో మాయ చిత్రంలోనూ, విజయ్‌సేతుపతికి జంటగా నానుమ్ రౌడీదాన్ చిత్రంలోనూ నటించింది. ఆ రెండు చిత్రాలు విజయం సాధించాయి.
 
 ఇప్పుడా వరుసలో నటి తమన్న చేరింది. తొలి రోజుల్లో యువ హీరోలతో నటించినా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న తరువాత టాప్ కథానాయకులతోనే నటిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు యువ నటుడు విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతోంది. దీనికి శీనురామసామి దర్శకత్వం వహించనున్నారు. ధర్మదురై పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల ప్రారంభమయ్యాలు. నటి తమన్న ఈ చిత్రాన్ని అంగీకరించడానికి కారణం తన కథా పాత్రేనట.
 
 దర్శకుడు కథను వివరించగానే తన పాత్రకు ప్రాధాన్యతతో పాటు వైవిధ్యంగా ఉండడంతో చాలా ఇంప్రెస్ అయ్యి వెంటనే నటించడానికి అంగీకరించిదట. చిత్ర షూటింగ్ జనవరి నుంచి రెగ్యులర్‌గా జరగనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. దర్శకుడు శీనురామసామి, విజయ్‌సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ధర్మదురై. మాయాండి కుటంబత్తార్ చిత్రం ద్వారా విజయ్‌సేతుపతికి దర్శకుడు శీనురామసామి అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ఇదం పొరుల్ ఏవల్ చిత్రం చేశారు. ఈ చిత్రం విడుదల కావలసి ఉంది. తాజాగా ధర్మదురై చిత్రానికి సిద్ధం అయ్యారు..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement