అందుకే ఈ గ్యాప్‌! | That's why this gap :Seerat Kapoor | Sakshi
Sakshi News home page

అందుకే ఈ గ్యాప్‌!

Published Wed, Oct 11 2017 12:25 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

That's why this gap :Seerat Kapoor - Sakshi

‘‘నాగార్జునగారి వంటి పెద్ద హీరోతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్‌ నుంచి లైట్‌బాయ్‌ వరకు ఆయన ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం ఇస్తారు. నాగ్‌ సార్‌ నుంచి ఎన్నో  నేర్చుకోవచ్చు. మా ఇద్దరి కాంబినేషన్లో చాలా సన్నివేశాలు ఉన్నాయి’’ అని హీరోయిన్‌ సీరత్‌ కపూర్‌ అన్నారు. నాగార్జున, సమంత, సీరత్‌ కపూర్‌ ముఖ్య పాత్రల్లో ఓంకార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘రాజుగారి గది–2’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సీరత్‌ చెప్పిన సంగతులు...

∙‘కొలంబస్‌’ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ వచ్చింది. ఆ సమయంలో నేను బాలీవుడ్‌ సినిమాల కోసం చూస్తున్నానని, తెలుగులో చేయడంలేదని కొందరు అన్నారు. అవన్నీ నిజాలు కావు. నాకు నచ్చిన పాత్రలు, కథలు దొరక్క గ్యాప్‌ వచ్చింది.  

∙‘కొలంబస్‌’ సినిమా ఫ్లాప్‌ ఎందుకైందో అర్థం కాదు. కథ, సినిమా చాలా బాగున్నాయి. అయినా బాగున్న సినిమాలన్నీ సక్సెస్‌ అవ్వాలనే రూలేం లేదు కదా? ∙ఓంకార్‌ మంచి దర్శకుడు. ఆయనతో పని చేయడం హ్యాపీ. హీరోని, హీరోయిన్‌ని ఓంకార్‌ వేర్వేరుగా చూడరు. అందర్నీ ఒకేలా చూస్తారు. ఏదైనా సమస్య ఉంటే ఫేస్‌ టు ఫేస్‌ చెప్పేస్తారు.  ∙ప్రస్తుతం విఐ ఆనంద్‌ డైరెక్షన్‌లో అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తోన్న సినిమా చేస్తున్నా. రవికాంత్‌ పేరేపు డైరెక్షన్లో రానా నిర్మాణంలో ఒక సినిమా, రవితేజగారి ‘టచ్‌ చేసి చూడు’ చేస్తున్నా. అన్నీ ఒకేసారి మొదలయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement