నాగార్జున రాజుగారి గది రెడీ! | Raju gari gadhi -2 will be released on october 13 | Sakshi
Sakshi News home page

నాగార్జున రాజుగారి గది రెడీ!

Published Mon, Jul 24 2017 8:45 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగార్జున రాజుగారి గది రెడీ! - Sakshi

నాగార్జున రాజుగారి గది రెడీ!

  • అక్టోబర్‌ 13న విడుదల

  • కింగ్‌ నాగార్జున హీరోగా ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘రాజుగారి గది-2'. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. అక్టోబర్‌ 13న ఈ సినిమా విడుదల కానుంది. ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కి విజయం సాధించిన ‘రాజుగారి గది' సినిమాకు ఇది సీక్వెల్.

    ఇందులో సమంత, సీరత్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో అశ్విన్, నరేశ్, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్‌ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. 'సొగ్గాడే చిన్నినాయన', 'ఊపిరి' వంటి హిట్‌ సినిమాల తర్వాత నాగార్జున నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement