మరుగుజ్జు పాత్రలో... | The role of the dwarf ... | Sakshi
Sakshi News home page

మరుగుజ్జు పాత్రలో...

Published Mon, Mar 21 2016 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM

మరుగుజ్జు పాత్రలో...

మరుగుజ్జు పాత్రలో...

‘విచిత్ర సోదరులు’ చిత్రంలో కమల్‌హాసన్ మరుగుజ్జు పాత్రలో నటించి సంచలనమే సృష్టించారు. ఇప్పుడు అలాంటి పాత్రలోనే షారుఖ్ ఖాన్ నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ‘దిల్‌వాలే’ ఫ్లాప్ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న షారుక్ తన స్టయిల్ మార్చేశారు. అందుకే  50 ఏళ్ల వయసులో కూడా కొత్తగా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యారు. తాజాగా ‘ఫ్యాన్’ చిత్రంలో ఓ సూపర్‌స్టార్‌గా, ఆ స్టార్‌ని అతిగా ప్రేమించి చివరకు ఆ సూపర్‌స్టార్ పాలిట విలన్‌గా మారిన ఓ అభిమానిగా షారుఖ్ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ ‘ఫ్యాన్’ ప్రచార చిత్రం సినిమాపై ఎన్నో అంచ నాలు పెంచేసింది.  ప్రస్తుతం ‘ఫ్యాన్’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న షారుఖ్, మరో పక్క ‘రయీస్’ సినిమా చిత్రీకరణను చకచకా  పూర్తిచేస్తున్నారు.

‘రయీస్’లో కూడా ఓ నిజజీవిత గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషిస్తున్నారు. మరి షారుఖ్ ఆ తరువాత సినిమా ఏంటి? దీని గురించి కొంతకాలం పాటు చాలా చర్చ జరిగింది. అయితే  సస్పెన్స్‌కు తెర పడింది. ‘రాంఝణా’, తను వెడ్స్ మను’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ లాంటి బ్లాక్‌బస్టర్స్‌తో హిందీ పరిశ్రమను తన వైపు తిప్పుకున్న దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ ఇప్పుడు షారుఖ్‌ను ఓ  మరుగుజ్జుగా చూపించనున్నారు. ఇప్పటివరకూ చిన్న చిత్రాలతో పెద్ద స్థాయి డెరైక్టర్‌గా మంచి  గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ ఓ బాలీవుడ్ అగ్రహీరోతో పనిచేయడం ఇదే తొలిసారి. ‘‘ఓ మరుగుజ్జు వ్యక్తి  చుట్టూ ఈ సినిమా తిరిగినా షారుఖ్ శైలిలో సాగే పాటలు, రొమాన్స్ కచ్చితంగా ఉంటాయి. కథానాయికను ఇంకా ఖరారు చేయలేదు’’ అని ఆయన చెప్పారు. మరి ఈ సినిమా షారుఖ్ కెరీర్‌కు ఎంత ఉపయోగపడుతుందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement