ఇద్దరు వ్యక్తులు కలిసి ఫొటో దిగాలంటే మూడో వ్యక్తి సహాయం కావాలి. లేదా కెమెరాలో ఓ టైమ్ సెట్ చేసుకుని, పరిగెత్తుకుంటూ వెళ్లి, మరో వ్యక్తి పక్కన నిలబడాలి. ‘సెల్ఫీ’ల పుణ్యమా అని ఇప్పుడంత హైరానా పడాల్సిన అవసరం లేకుండా పోయింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఎంచక్కా ఫొటోలు క్లిక్‌మనిపించుకోవచ్చు. ఈ సరదా విషయంలో సామాన్యులు, సెలబ్రిటీలనే తేడా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే సెలబ్రిటీలే ఈ సెల్ఫీకి ఎక్కువ పాపులార్టీ తీసుకొచ్చారు. ఈ వారం... పది రోజుల్లో రకరకాల అకేషన్స్‌లో సెల్ఫీలు దిగి, సంబరపడిపోయిన తారల ఫొటోలు ఇవాళ్టి స్పెషల్.
1. ఇది అమెరికన్ సెల్ఫీ. అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’లో మన బాలీవుడ్ కథానాయిక ప్రియాంకా చోప్రా లీడ్ రోల్ చేస్తున్నారు. ఆ లొకేషన్‌లో కొంతమంది టీమ్ మెంబర్స్‌తో ప్రియాంక సెల్ఫీకి ఇలా పోజిచ్చారు.
2. రామ్ అంటేనే ఓ ఎనర్జీ. ఈ ఎనర్జీకి బ్రహ్మానందం తోడైతే ఇక చుట్లూ ఉన్నవాళ్లు పండగ చేసుకోవాల్సిందే. ‘శివమ్’ లొకేషన్‌లో ఇలా బ్రహ్మానందంతో కలిసి సెల్ఫీ దిగుతూ శివమెత్తారు రామ్.
3. హైదరాబాద్‌లో కబడ్డీ పోటీలు జరుగుతుంటే అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వెళ్లారు. వెంట సతీమణి స్నేహ కూడా వెళ్లారు. ఆ సందట్లో ఇలా వైఫ్‌తో సెల్ఫీ దిగారు బన్నీ.
4. ఇది ఫ్లయిట్ సెల్ఫీ. దుబాయ్‌లో ఇటీవల ‘సైమా’ అవార్డుల వేడుక జరిగింది. అక్కడికి వెళుతున్నప్పుడు నాగచైతన్య, చార్మి ఇలా సరదాగా సెల్ఫీ దిగారు.
5. ‘రేసుగుర్రం’లో శ్రుతీహాసన్‌ది సూపర్ క్యారెక్టర్. ఇంత మంచి పాత్ర ఇచ్చిన సురేందర్‌రెడ్డి అంటే ఆమెకు ప్రత్యేకమైన అభిమానం. ఈ మధ్య ఓ ఫంక్షన్‌లో సురేందర్‌రెడ్డి తారసపడగానే శ్రుతీ ఇలా సెల్ఫీ దిగి సంబరపడిపోయారు.
6. రామ్‌చరణ్, రకుల్ ప్రీత్ సింగ్‌లు బ్యాంకాక్‌లో శ్రీను వైట్ల దర్శకత్వంలో లాస్ట్ వీక్ షూటింగ్ చేశారు. బైక్ మీద కొన్ని షాట్స్ తీస్తుంటే ఇలా సెల్ఫీ దిగుదామని రకుల్ ముచ్చట పడింది. చెర్రీ సరే అన్నాడు.
7. ‘1 నేనొక్కడినే’ సినిమాలో మహేశ్‌తో ఆడిపాడిన కృతీసనన్ తన చెల్లెలు నుపుర్‌తో జంటగా... కొంటెగా దిగిన సెల్ఫీ భలే ఉంది కదా. దీనికి ‘ఫ్రెండ్‌ఫిప్ డే’ సెల్ఫీ అనే టాగ్‌లైన్ కూడా ఉంది.
8. తాప్సీకి తన చెల్లెలు షగున్ అంటే ప్రాణం. ఇద్దరూ కలిశారంటే ఇల్లు పీకి పందిరేస్తారు. ఇద్దరూ తెగ అల్లరి చేస్తూ, ఇలా కూడా సెల్ఫీలు దిగొచ్చన్నట్టు ఫోజులిచ్చారు. నైస్ సెల్ఫీలు కదూ!
ఈ స్టార్లు చాలా సెల్ఫీష్
Published Tue, Aug 18 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM
Advertisement
Advertisement