అదే తరహా పాత్రలతో భయమేస్తోంది! | Thought I'd get typecast in Bollywood: Taapsee Pannu | Sakshi
Sakshi News home page

అదే తరహా పాత్రలతో భయమేస్తోంది!

Published Sat, Jan 24 2015 11:58 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అదే తరహా పాత్రలతో భయమేస్తోంది! - Sakshi

అదే తరహా పాత్రలతో భయమేస్తోంది!

ముంబై: కచ్చితమైన కొలతలతో చూడ చక్కని ముఖారవిందం తాప్సీ పన్నూ సొంతం. పక్కింటి అమ్మాయిగా, పాశ్చాత్య యువతిగా ఒదిగి పోయేశరీర సౌష్టం కలిగిన ఈ అమ్మడు సమున్నత స్థానాన్ని సంపాదించడంలో విఫలమవుతూనే ఉంది.అయితే ఈ మధ్య అడపా దడపా కొన్ని సినిమాల్లో చేస్తూ నెట్టుకోస్తోంది. ప్రస్తుతం సినిమా అవకాశాలు బాగానే వస్తున్నా.. తాప్సీని భయం వెంటాడుతోందట. తనకు ఒకే తరహా పాత్రలో రావడం  ఆందోళనకు గురిచేస్తోందని తాప్సీ తాజాగా స్స్టష్టం చేసింది. ప్రస్తుతం 'చాష్మే బాద్దూర్' హిందీ చిత్రంలో తాప్సీ కాలేజీ అమ్మాయి పాత్రను చేస్తోంది. కాగా, ఇప్పడు కొన్ని అవకాశాలు వస్తున్నా.. ఒకే తరహా పాత్రలు రావడం ఆమెను కలవరానికి గురిచేస్తోంది.
 

ఇదిలా ఉండగా తాను ఎప్పుడూ కూడా నటిని అవుతానని ఊహించలేదని తాప్సీ వయ్యారాలు ఒలగబోస్తోంది. అసలు కెమెరాకు ఫోజివ్వాల్సి వస్తుందని  జీవితంలో అనుకోలేదని తెలిపింది.   అసలు ఈ రంగంలోకి రావడమే తాను చేసిన తప్పని ఇప్పుడు అనుకుంటున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.  తనకు చదువంటే బాగా ఇష్టమైనా.. తలరాత ఈ రకంగా రాసి ఉంటే చేసేదేముందని ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement