
కోళ్లు, మేకలకు ముసలితనం తెలియదు: పూరీ
మాంసం అమ్మకాల నిషేధంపై జరుగుతున్న వివాదంపై టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ విభిన్నంగా స్పందించారు. ''ప్రపంచంలో ఏ కోడీ వృద్ధాప్యం చూడలేదు, ఏ మేకకూ ముసలితనం అంటే ఏంటో తెలియదు'' అని ఆయన కామెంట్ చేశారు. కోళ్లు, మేకలను అవి పూర్తి జీవితం గడపడానికి ముందే అందరూ కోసుకుని తినేస్తున్నారన్న కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో ఏ కోడి వ్రుదాప్యం చూడలేదు . ఏ మేకకు ముసలితనం అంటే ఏంటో తెలియదు .
— PURI JAGAN (@purijagan) September 11, 2015