meat ban
-
యోగికి పదిరోజుల సమయమిచ్చిన హైకోర్టు
నచ్చిన ఆహారాన్ని తినడం, ఆహార పదార్థాల వ్యాపారాన్ని చేపట్టడం జీవన హక్కులో భాగమేనని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ కబేళాలు, మాంసం దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి హైకోర్టు ఈ విషయంలో సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు పదిరోజుల సమయాన్ని ఇచ్చింది. అక్రమ కబేళాలు, మాసం దుకాణాలపై అణచివేత కారణంగా ప్రజల ఆహార అలవాట్లు, ఉపాధి హక్కులు దెబ్బతినకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించి.. పది రోజుల్లో తమకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ రకాల ఆహార అలవాట్లు ప్రజల జీవనవిధానంలో భాగంగా ఉన్నాయని, రాష్ట్ర లౌకిక సంస్కృతిలో ఇవి ముఖ్యభాగమని హైకోర్టు లక్నో ధర్మాసనం విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. తన మాంసం దుకాణం లైసెన్స్‌ను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక వ్యాపారి హైకోర్టును ఆశ్రయించారు. మాంసం దుకాణానికి లైసెన్సులు ఇవ్వడంలో యూపీ ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల తాను వ్యాపారం నిర్వహించుకోలేకపోతున్నామని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. యూపీలో యోగి ప్రభుత్వం వచ్చాక.. అక్రమ కబేళాలు, మాంసం దుకాణాలపై ఉక్కుపాదం మోపడంతో ఈ వ్యాపారం పూర్తిగా పడకేసిన సంగతి తెలిసిందే. -
కొలిక్కి వచ్చిన 'మాంసం' గొడవ
ముంబై: మాంసం అమ్మాకాల నిషేధంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కొలిక్కి వచ్చింది. మొదట ఎనిమిది రోజులు అన్నారు.. అది కనుమరుగైంది. తర్వాత దాన్ని నాలుగు రోజులకు కుదించారు. అది కాస్త తాజాగా శుక్రవారం సాయంత్రానికి ఒక్కరోజే చాలు అని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాయంత్రం ప్రతినిధులతో చర్చించిన అనంతరం ఈ సమాచారాన్ని వెల్లడించింది. ముంబైలో ఈనెల 17న మాత్రమే మాంసం అమ్మకాలను నిలిపేయాలని ఆదేశాలు జారీచేసింది. జైనుల పవిత్ర దీంతో మొత్తం నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాంసం అమ్మకాలు నిషేధించినట్లయింది. -
కోళ్లు, మేకలకు ముసలితనం తెలియదు: పూరీ
మాంసం అమ్మకాల నిషేధంపై జరుగుతున్న వివాదంపై టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ విభిన్నంగా స్పందించారు. ''ప్రపంచంలో ఏ కోడీ వృద్ధాప్యం చూడలేదు, ఏ మేకకూ ముసలితనం అంటే ఏంటో తెలియదు'' అని ఆయన కామెంట్ చేశారు. కోళ్లు, మేకలను అవి పూర్తి జీవితం గడపడానికి ముందే అందరూ కోసుకుని తినేస్తున్నారన్న కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏ కోడి వ్రుదాప్యం చూడలేదు . ఏ మేకకు ముసలితనం అంటే ఏంటో తెలియదు . — PURI JAGAN (@purijagan) September 11, 2015 -
'దేశానికి హాని చేయాలనుకుంటోంది'
న్యూఢిల్లీ: గోమాంసం నిషేధంతో భారతదేశానికి, సమాజానికి బీజేపీ హానీ చేయాలనుకుంటుందని మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ ఆరోపించారు. త్వరలో బక్రీద్ రానున్న నేపథ్యంలో ఇలాగే నిషేధం కొనసాగితే విపరీత పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే జైనుల పవిత్ర దినం సందర్భంగా మాంసంపై మహారాష్ట్రలో మాంసం నిషేధించడంపట్ల పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే అటు జమ్మూకాశ్మీర్, హర్యానాతోపాటు పలు రాష్ట్రాల్లో గోమాంసం అమ్మకాల నిషేధం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై పలువర్గాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా సిద్ధిఖీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'త్వరలో బక్రీద్ వస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే సమాజంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. మాంసంపై నిషేధం విధించి ఒకరిని సంతృప్తి పరచడానికి ఇది సరైన సమయం.. సరైనది కూడా కాదు. ఇది వరకే బీజేపీ తాము మైనారిటీలను సంతృప్తిపరిచే చర్యలకు దిగడం లేదని చెప్పింది. కానీ జైనులు కూడా మైనారిటీలే కదా. అయినా, ఎవరేం తినాలో తినకూడదో అనే అంశాన్ని తెరపైకి తెచ్చి చర్చించుకుంటూ ఒక హాస్య వాతావరణం సృష్టించాం' అని ఆయన అన్నారు. -
'బీజేపీ అంటే.. భారతీయ జంతుపక్ష పార్టీ'
మహారాష్ట్రలో మాంసం విక్రయాల నిషేధంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అంటే భారతీయ జంతుపక్ష పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ముంబైలో ఏం చేయాలన్నది కేవలం జైనులు మాత్రమే నిర్ణయించలేరు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. రేపు మరో వర్గానికి చెందిన ప్రజలు తమ పండుగ రోజుల్లో షాపులన్నీ మూసేయాలంటే అప్పుడు మూసేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఓటుబ్యాంకు రాజకీయాల నుంచి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని రాజ్ ఠాక్రే మండిపడ్డారు. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా హిందువులకు జైనులు వ్యతిరేకమనే భావన వస్తోందని ఆయన అన్నారు.