ముంబై: మాంసం అమ్మాకాల నిషేధంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కొలిక్కి వచ్చింది. మొదట ఎనిమిది రోజులు అన్నారు.. అది కనుమరుగైంది. తర్వాత దాన్ని నాలుగు రోజులకు కుదించారు. అది కాస్త తాజాగా శుక్రవారం సాయంత్రానికి ఒక్కరోజే చాలు అని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాయంత్రం ప్రతినిధులతో చర్చించిన అనంతరం ఈ సమాచారాన్ని వెల్లడించింది. ముంబైలో ఈనెల 17న మాత్రమే మాంసం అమ్మకాలను నిలిపేయాలని ఆదేశాలు జారీచేసింది. జైనుల పవిత్ర దీంతో మొత్తం నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాంసం అమ్మకాలు నిషేధించినట్లయింది.