'బీజేపీ అంటే.. భారతీయ జంతుపక్ష పార్టీ'
మహారాష్ట్రలో మాంసం విక్రయాల నిషేధంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అంటే భారతీయ జంతుపక్ష పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ముంబైలో ఏం చేయాలన్నది కేవలం జైనులు మాత్రమే నిర్ణయించలేరు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. రేపు మరో వర్గానికి చెందిన ప్రజలు తమ పండుగ రోజుల్లో షాపులన్నీ మూసేయాలంటే అప్పుడు మూసేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
ఇలాంటి ఓటుబ్యాంకు రాజకీయాల నుంచి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని రాజ్ ఠాక్రే మండిపడ్డారు. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా హిందువులకు జైనులు వ్యతిరేకమనే భావన వస్తోందని ఆయన అన్నారు.