
గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కేరళ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలకు ఊళ్లన్ని చెరువలని తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు 350 మందికిపైగా ప్రాణాలు కొల్పోగా లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిన కేరళను ఆదుకునేందుకు టాలీవుడ్ స్టార్స్ కూడా ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి 50 లక్షల డబ్బు, మరో 10 లక్షల రూపాయల మందులు అందించేందుకు ముందుకు వచ్చారు. కేరళ ప్రజలు ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుచుకునే బన్నీ 25 లక్షలు ప్రకటించగా.. సీనియర్ హీరో కింగ్ నాగార్జున 28 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. యంగ్ హీరో ఎన్టీఆర్ 25 లక్షలు మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ 10 లక్షలు ప్రకటించారు. బాహుబలి ప్రభాస్ కూడా 25 లక్షల రూపాయల ఆర్ధికసాయం అందిస్తున్నట్టుగా వెల్లడించారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ 5 లక్షలు, దర్శకుడు కొరటాల శివ 3 లక్షలు తమవంతు సాయంగా ప్రకటించారు. ఇటీవల ఘనవిజయం సాధించిన గీత గోవిందం చిత్ర నిర్మాత బన్నీ వాసు తమ చిత్ర కేరళ వసూళ్లను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇస్తున్నట్టుగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment