బికినీ వివాదంపై నటి ఘాటు స్పందన | TV Actress Rubina Dilaik Again Posts A Bikini Photos | Sakshi
Sakshi News home page

బికినీ వివాదంపై నటి ఘాటు స్పందన

Published Sat, Mar 10 2018 9:14 PM | Last Updated on Sun, Mar 11 2018 11:49 AM

TV Actress Rubina Dilaik Again Posts A Bikini Photos - Sakshi

నటి రుబినా దిలాయక్ ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటో

సాక్షి, ముంబై: నటి రాధికా ఆప్తే బికినీ ఫొటోల వివాదం ముగియక ముందే మరోనటి రుబినా దిలాయక్ బికినీ ఫొటోలపై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. చీప్ గాళ్, సిగ్గులేదా అంటూ నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నటి కూడా అంతే ఘాటుగా బదులిస్తూ మరో ఫొటోను షేర్ చేసి, తాను ఏ విషయానికి భయపడేది లేదని చెప్పకనే చెప్పారు. ‘శక్తి అస్థిత్వ కే ఎహ్‌ సాస్‌కి’టీవీ సీరియల్‌లో ట్రాన్స్‌జెండర్ పాత్ర పోషించిన రుబినా చాలా పాపులర్ అయ్యారు.

తరచూ తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వివాదాల్లో చిక్కుకునే ఈ బుల్లితెర నటి మరోసారి తన బికినీ ఫొటోలతో విమర్శలకు గురయ్యారు. నటి రుబినా బికినీ ధరించి హాట్ హాట్ ఫోజులివ్వగా ఆమె బాయ్‌ఫ్రెండ్ అభినవ్ శుక్లా తీసిన ఫొటోలను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల పోస్ట్ చేసిన బికినీ ఫొటోపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. సిగ్గులేదా, చీప్ గాళ్ అంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు మాత్రం చాలా అందంగా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లకు బదులిస్తూ నటి రుబినా మరో ఫొటో షేర్ చేశారు. ‘నా శరీరంతో ఎంతో సౌకర్యవంతంగా, ఆరోగ్యంగా ఉన్నాను. ఆ విషయం నాకు తెలుసు. ధన్యవాదాలు అంటూ’ మరో ఫొటోను షేర్ చేసి విమర్శకులకు అంతే ధీటుగా బదులిచ్చారు. వ్యక్తిగత స్వేచ్ఛ ఎవరికైనా అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.


నటి రుబినా దిలాయక్ ఇన్‌స్టాగ్రామ్‌ లో మొదట పోస్ట్‌ చేసిన ఫొటో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement