![](/sites/default/files/article_images/2013/11/30/71385758119_Unknown.jpg)
ఆయనలో ఆత్మవిశ్వాసం ఎక్కువ
Published Sat, Nov 30 2013 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
![](/sites/default/files/article_images/2013/11/30/71385758119_Unknown.jpg)
ఇంతకీ ఈ క్రేజీ హీరోయిన్ అంతగా ప్రశంసల జల్లు కురిపిస్తున్న ఆ నటుడు ఎవరనుకుంటున్నారా! ఇంకెవరు నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ఇదు కదిర్‌వేలన్ కాదల్. సుందర పాండియన్ చిత్రం ఫేమ్ ప్రభాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తన పోర్షన్ పూర్తి అయిన సందర్భంగా నయనతార ఈ చిత్రంలో నటించిన తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు. దర్శకుడు ప్రభాకరన్ గత చిత్రం చూశానని తొలి చిత్రంతోనే ప్రతిభావంతుడైన దర్శకుడని నిరూపించుకున్నారని తెలిపారు.
ఇక ఇదు కదిరవేలన్ కాదల్ విషయానికొస్తే ఇది మనసులను హత్తుకునే చక్కని కుటుంబ కథా చిత్రం అని పేర్కొన్నారు. ఉదయనిధి స్టాలిన్‌తో నటించడం తీయని అనుభూతి అని చెప్పారు. ఈ చిత్ర యూనిట్‌తో పని చేయడం చాలా సౌలభ్యంగా ఫీలయ్యానన్నారు. షూటింగ్‌లో జరిగిన చిన్న చిన్న సంతోషకరమైన సంఘటనలు తీయని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని నయనతార అన్నారు. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషలలో తెరకెక్కుతున్న అనామిక చిత్రంలో నటిస్తున్న ఈ సంచలన నటి తదుపరి పాండియరాజ్ దర్శకత్వంలో శింబుకు జంటగా, జయంరాజా దర్శకత్వంలో జయంరవి సరసన నటించడానికి సిద్ధం అవుతున్నారు.
Advertisement
Advertisement