యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ రేపు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్‌లో తెరకెక్కింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా కనిపించనుండగా జగపతిబాబు, నాగబాబు, నవీన్ చంద్రలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్ లు సృష్టిస్తున్న అరవింద సమేత వీర రాఘవపై ఉమైర్ సందు అనే వ్యక్తి రివ్యూ ఇచ్చేశాడు. దుబాయ్‌లో ఎంటర్‌టైన్మెంట్ జర్నలిస్ట్‌గా చెప్పుకునే ఉమైర్ గతంలోనూ స్టార్ హీరోల చిత్రాలకు ముందే రోజే రివ్యూ ఇచ్చాడు. అయితే అదే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను ఇబ్బంది పెడుతోంది.
గతంలో బాహుబలి ది బిగినింగ్ సినిమాకు దారుణమైన రివ్యూ ఇచ్చిన ఉమైర్.. తరువాత కాటమరాయుడు, అజ్ఞాతవాసి లాంటి సినిమాలకు సూపర్ హిట్ రివ్యూలు ఇచ్చాడు. ఇప్పుడు అరవింద సమేతను కూడా సూపర్ హిట్ అంటూ పొగిడేయటంతో రిజల్ట్ ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు ఫ్యాన్స్.
Comments
Please login to add a commentAdd a comment