RRR Movie First Review In Telugu: RRR Movie First Review By Film Critic Umair Sandhu - Sakshi
Sakshi News home page

RRR Movie First Review: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను మిస్‌ కాకుండా చూడాల్సిందే!

Published Wed, Mar 23 2022 9:22 AM | Last Updated on Wed, Mar 23 2022 9:45 AM

RRR Movie First Review By Film Critic Umair Sandhu - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం.. రణం.. రుధిరం).. 2020లోనే రావాల్సిన సినిమా.. కానీ ఎన్నోసార్లు వాయిదాలు పడి చివరాఖరకు రెండేళ్ల తర్వాత మార్చి 25న రిలీజవుతోంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కుంభస్థలాన్ని బద్ధలు కొట్టడం గ్యారెంటీ అని అటు నిర్మాతలు, ఇటు ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. మరి అతి భారీ అంచనాల మధ్య విడుదలవుతోన్న ఈ చిత్రం ఎలాంటి సంచనాలు సృష్టించనుంది? గతంలో బాహుబలి క్రియేట్‌ చేసిన రికార్డులను బద్ధలు కొడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఐదు స్టార్ల రేటింగ్‌ ఇచ్చాడో సినీ విమర్శకుడు. ఓవర్‌సీస్‌ సెన్సార్‌ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్‌ సంధు సినిమా రిలీజ్‌కు ముందే ఆర్‌ఆర్‌ఆర్‌ చూసేశానంటూ సోషల్‌ మీడియాలో రివ్యూ ఇచ్చేశాడు.

'భారతీయ సినిమా పెద్ద కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవచ్చని నిరూపించిన చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రాన్ని ఎవరూ మిస్‌ కాకుండా చూసి తీరాల్సిందే! ఇప్పుడు దీన్ని బ్లాక్‌బస్టర్‌ అని చెప్పుకున్నా రేపటి తరానికి మాత్రం ఇదొక క్లాసిక్‌గా మిగిలిపోతుంది. చరణ్‌, ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించారు. వారి కాంబినేషన్‌ అదిరింది. అజయ్‌ దేవ్‌గణ్‌ ఒక సర్‌ప్రైజ్‌ ప్యాకేజీలా కనిపిస్తాడు. ఆలియా భట్‌ ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తుంది' అని ఉమైర్‌ సంధు ట్విటర్‌లో రాసుకొచ్చాడు. ఈ చిత్రంతో రాజమౌళి ఇండియాలోనే నెంబర్‌ 1 డైరెక్టర్‌గా మారిపోతాడంటూ ఉమైర్‌ దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తూ మరో ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement