అమర జవాన్ల సహాయార్థం ‘యూరీ’ షో | URI Show Funds To Martyred Jawan Families | Sakshi
Sakshi News home page

అమర జవాన్ల సహాయార్థం ‘యూరీ’ ప్రదర్శన

Published Sat, Mar 2 2019 12:45 PM | Last Updated on Sat, Mar 2 2019 12:52 PM

URI Show Funds To Martyred Jawan Families - Sakshi

సర్జికల్‌ స్ట్రైక్‌నేపథ్యంలో తెరకెక్కిన యూరీ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 250కోట్లను కొల్లగొట్టినట్టు సమాచారం. ఎటువంటి అంచనాలు, స్టార్‌ క్యాస్టింగ్‌ లేకుండా విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.

ఈ సినిమాకు పలు రాష్ట్రాలు జీఎస్టీ నుంచి మినహాయింపును ప్రకటించాయి. ఈ చిత్రం దేశభక్తిని పెంపొందించేలా ఉందని సినీ, రాజకీయ ప్రముఖులు కొనియాడారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ‘యూరీ’ సినిమాను ప్రదర్శించనున్నారు. ఎల్బీ నగర్‌ బీవీకే మల్టీప్లెక్స్‌లో ఆదివారం ఉదయం 8 గంటలకు ఈ షోను ప్రదర్శించనున్నట్లు, ఈ షోతో వచ్చిన ఆదాయాన్ని అమరులైన సైనిక కుటుంబాలకు అందజేయనున్నట్లు తెలిపారు. విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని​ ఆదిత్యా ధర్‌ తెరకెక్కించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement