రిస్క్‌లోనే కిక్! | Uttama Villain is Alla set to reach the audience from March 1 | Sakshi
Sakshi News home page

రిస్క్‌లోనే కిక్!

Published Sun, Feb 1 2015 10:24 PM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM

రిస్క్‌లోనే కిక్! - Sakshi

రిస్క్‌లోనే కిక్!

సవాళ్లను ఎదుర్కోవడం కమలహాసన్‌కి చాలా ఇష్టం. అందుకే సాదా సీదా పాత్రలు చేయడానికి ఆయన పెద్దగా ఆసక్తి కనబర్చరు. మరి... రిస్క్‌లోనే కిక్ ఉందనుకుంటారో ఏమో కానీ.. కథాంశం, గెటప్.. అన్నీ దాదాపు రిస్క్‌తో కూడుకున్నవిగానే ఉంటాయి. అందుకు ఉదాహరణగా.. ‘విచిత్ర సోదరులు’, ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘భారతీయుడు’, ‘భామనే సత్యభామనే’.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాత్రలు ఉన్నాయి. తాజాగా, ‘ఉత్తమ విలన్’ చిత్రంలో కమల్ గెటప్ గురించి చెప్పాలి. ఇందులో కమల్ ద్విపాత్రల్లో కనిపిస్తారు.
 
 వాటిలో తెయ్యమ్ కళాకారుడి  పాత్ర ఒకటి. తెయ్యమ్ అంటే కేరళకు చెందిన కళ. ఈ చిత్రం ప్రారంభం సమయంలోనే తెయ్యమ్ కళాకారుడి గెటప్‌ని విడుదల చేశారు. ఆ గెటప్ కోసం కమల్ దాదాపు మూడు, నాలుగు గంటలు మేకప్‌కే కేటాయించారు. ఆరు పదుల వయసులోనూ ఇంతటి క్లిష్టమైన పాత్రలు చేస్తున్నారంటే కమల్‌కి సినిమాలంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. నటుడు రమేశ్ అరవింద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు.. ముఖ్యంగా కమల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి, 1న పాటలను విడుదల చేసి, వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement