కేరళ బ్యూటీకి కమల్ సరసన నటించే ఛాన్స్ | parvati menon acts in uthama villain | Sakshi
Sakshi News home page

కేరళ బ్యూటీకి కమల్ సరసన నటించే ఛాన్స్

Published Sat, Mar 22 2014 4:09 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

పార్వతీ మీనన్ - Sakshi

పార్వతీ మీనన్

సినిమా రంగం  చిత్రమైనది. కొన్ని సందర్భాలలో కొందరికి అవకాశాలు ఎలా వస్తాయో కూడా అర్ధం కాదు. ముఖ్యంగా హీరోయిన్స్కు వచ్చే అవకాశాలు చాలా చిత్రాతి చిత్రంగా ఉంటాయి. అందం - అభినయం - అదృష్టం...మీద ఆధారపడి అవకాశాలు వస్తాయని చాలా మంది చెబుతుంటారు. కొన్ని చెప్పలేని అంశాల వల్ల కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.  కొంతమందికి ఎంత ప్రయత్నించినా ఆఫర్లు రావు. మరికొంత మందికి మాత్రం అనుకోకుండా అదృష్టం తలుపుతడుతూ ఉంటుంది. అదృష్టవంతుల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాటంతట అవే అవకాశాలు వస్తూ ఉంటాయి.  కేరళ బ్యూటీ పార్వతీ మీనన్కు ఇప్పుడు అలాంటి అదృష్టమే పట్టింది. ఓ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది.

పార్వతీ మీనన్ అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియదు. తమిళ, కన్నడ ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు అది. అంతే కాకుండా  తను నటించిన సినిమా ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సుందరాంగి కోలీవుడ్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది.   విశ్వనాయకుడు కమల్ హాసన్ కంట్లో పడింది. అంతే ఆమె పంటపండింది. కమల్ మనసు దోచేసింది. వెంటనే ఆమెకు తన సరసన నటించే అవకాశం ఇచ్చేశాడు.

కమల్కు కొత్తవారిని ప్రోత్సహించే అలవాటు ఉంది. ఈ బ్యూటీని చూశాడు. పిచ్చపిచ్చగా నచ్చేసింది. అంతే పార్వతికి బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు.  కమల్ నటిస్తోన్న 'ఉత్తమవిలన్' మూవీలో ఓ ముఖ్య పాత్రను పార్వతి పోషిస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు ఉత్తమ విలన్ షూటింగ్లో పాల్గొంటున్నట్లు సమాచారం. కమల్ మూవీ అంటే అది తప్పక తెలుగులో కూడా విడుదల అవుతుంది. ఆ విధంగా ఈ ముద్దుగుమ్మ  మన తెలుగు దర్శకుల కంట్లో కూడా పడి  అవకాశాలు కొట్టేస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement