
రజనీకి జంటగా విద్యాబాలన్
రజనీకాంత్‌కు జంటగా నటి విద్యాబాలన్ నటించనున్నారు. ‘కబాలి’ చిత్రం తర్వాత మళ్లీ రంజిత్ పా దర్శకత్వంలో రజనీకాంత్ నటించే అవకాశం లభించింది. ఈ చిత్రాన్ని ధనుష్ వండర్‌బార్ ఫిలిమ్స్ సంస్థ రూపొందిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ మే నెలలో ప్రారంభం కానున్నట్లు, ఇందులో రజనీకి జంటగా బాలివుడ్ నటి విద్యాబాలన్ నటించవచ్చనే సమాచారం వెలువడింది. దీనిగురించి విద్యాబాలన్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి.
కబాలి చిత్రంలో మొదట్లో రజనీకి జంటగా నటించేందుకు విద్యాబాలన్‌తో చర్చలు జరిపారు. అయినప్పటికీ, అప్పట్లో కాల్షీట్లు కుదరలేదు. దీంతో ఆ చిత్రావకాశం రాధికా అప్టేను వరించింది. ప్రస్తుతం మళ్లీ రజనీతో నటించే అవకాశం విద్యాబాలన్‌ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ చిత్రంలోనూ రజనీ వృద్ధ గెటప్‌లో నటించనున్నారని సమాచారం. – టినగర్