‘అర్జున్‌ రెడ్డి’ ఆర్థిక సాయం! | Vijay devarakonda Donation To Kerala Flood Relief Fund | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 12 2018 3:17 PM | Last Updated on Sun, Aug 12 2018 3:21 PM

Vijay devarakonda Donation To Kerala Flood Relief Fund - Sakshi

తమకు వచ్చిన మొదటి ఫిలింఫేర్‌ అవార్డును ఎంతో అపురూపంగా చూసుకుంటారు సినీ నటులు. కానీ విజయ్‌ దేవరకొండ మాత్రం అందుకు భిన్నం. ‘అర్జున్‌ రెడ్డి’ నటనకు గానూ విజయ్‌కు వచ్చిన ఫిలింఫేర్‌ అవార్డ్‌ను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చేశాడు. ఆ అవార్డును వేలం వేయగా వచ్చిన 25లక్షలను విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. 

గత కొన్ని రోజులుగా ప్రకృతి విధ్వంసానికి కేరళ బలైపోతోంది. వరదలతో ఇడుక్కి సహా పలు జిల్లాలు నీట మునిగాయి. కేరళ వరద బాధితులకు విరాళాలను సేకరిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే కోలీవుడ్‌ నుంచి విశాల్‌, సూర్య, కార్తీలు తమ వంతు సహాయాన్ని అందించారు. మరి కొంతమంది ప్రముఖులు కూడా ముందుకు వస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి విజయ్‌ దేవరకొండ తన వంతు సహాయంగా ఐదు లక్షల రూపాయల్ని విరాళంగా ఇచ్చేశారు. తమ వంతు సహాయమందించాలని విజయ్‌ తన అభిమానులను కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement