
రామ్‌చరణ్
‘వినయ విధేయ రామ’ సినిమా పూర్తి కాకముందే రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు రామ్‌చరణ్. ఆ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తికాగానే మళ్లీ ‘వినయ విధేయ రామ’ లో జాయిన్ అయ్యి షూటింగ్ పూర్తి చేయనున్నారట. అంటే.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ యాక్షన్ మోడ్ నుంచి మళ్లీ వినయంగా కుటుంబంతో కలసి ‘వినయ విధేయ రామ’ సెట్లో చిందేస్తారట. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వినయ విధేయ రామ’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి అయింది. ఈ రెండు పాటల్లో ఒకటి ఫ్యామిలీ సాంగ్ కాగా, మరొకటి ఐటమ్ సాంగ్ అని సమాచారం. డిసెంబర్ 13 నుంచి ఈ షూటింగ్ స్టార్ట్ చేస్తారట చరణ్. ఫ్యామిలీ సాంగ్‌లో చిత్రబృందమంతా పాల్గొంటారట. జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment