వీఐపీ.. మళ్లీ వస్తున్నాడు!
ధనుష్, అమలాపాల్ జంటగా నటించిన 'రఘువరన్ బీటెక్' సినిమా అటు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి హిట్టయింది. ఆ సినిమా సీక్వెల్ షూటింగ్ గురువారం చెన్నైలో ప్రారంభమైంది. ధనుష్ మరదలు, రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు.. రజనీకాంత్ స్వయంగా క్లాప్ కొట్టారు. తన కూతురిని, అల్లుడిని ఆయన ఆశీర్వదించారు.
'వేలై ఇల్లా పట్టదారి' (వీఐపీ) అనే తమిళ సినిమాకు తెలుగులో అనువాద చిత్రంగా వచ్చిన రఘువరన్ బీటెక్ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ‘విఐపి 2’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రఘువరన్ ఈజ్ బ్యాక్’ అన్నది ట్యాగ్‌లైన్. ఈ చిత్రానికి స్టోరీ, డైలాగ్స్ ధనుష్ రాయడం ఓ విశేషం. ‘కబాలి’ చిత్ర నిర్మాత కలైపులి ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు.