అజిత్
ఒకరేమో వైట్ అండ్ వైట్. సిటీలో ఉండే వ్యక్తి. మరొకరు బ్లాక్ అండ్ బ్లాక్. పక్కా మాస్. విలేజ్ గెటప్. చూడటానికి ఇద్దరూ ఒకేలా ఉంటారు. మరి ఇద్దరూ ఒక్కరేనా? లేక వేరు వేరా? లేకపోతే హీరో– విలనా? అన్నవి ప్రస్తుతానికి ప్రశ్నలే. సమాధానాలు సంక్రాంతికి తెలవనున్నాయి. అజిత్ కుమార్ హీరోగా దర్శకుడు శివ రూపొందిస్తున్న తమిళ చిత్రం ‘విశ్వాసం’. నయనతార కథానాయిక. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.
దర్శకుడు శివ, అజిత్ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రం ఇది. ఇంతకుముందు ఈ కాంబినేషన్‌లో ‘వీరం, వేదాళం, వివేగమ్’ చిత్రాలు వచ్చాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ‘విశ్వాసం’ ఫస్ట్ లుక్‌ను గురువారం రిలీజ్ చేశారు చిత్రబృందం. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఒక గెటప్‌లో మీసం నిమురుతుండగా, నల్లటి గడ్డం లుక్‌లో మరో గెటప్‌లో మీసం మెలేస్తున్నారు అజిత్. ఈ లుక్స్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ చిత్రానికి డి. ఇమ్మాన్ సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment