ఆ సినిమా చూసి..
బ్రెజిల్: 'కంజ్యూరింగ్' ఈ సినిమా పేరు తెలియని హర్రర్ మూవీ ప్రేమికులు ఉండరంటే అతిశయోక్తి కాదు. కంజ్యూరింగ్ నుంచి తాజాగా విడుదలైన చిత్రం 'ఆనబెల్'. ఈ చిత్రాన్ని థియేటర్‌లో విక్షించిన ఓ యువతి తనను తాను కొట్టుకుంటూ వికృతంగా పవర్తించింది. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. బ్రెజిల్‌లోని టెరెసినా ప్రాంతానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతి తన స్నేహితులతో కలిసి ‘ఆనబెల్’ సినిమాకు వెళ్లింది.
సినిమా చూసిన అనంతరం థియేటర్ నుంచి బయటికి వస్తుండగా ఉన్నట్టుండి గట్టిగా కేకలు వేస్తూ.. తనని తానే గాయపరుచుకుంటూ వింతగా ప్రవర్తించింది. ఆమె వింత ప్రవర్తనను చూసిన స్నేహితులు నిశ్చేష్టులయ్యారు. ఆమెని ఎంత అదుపుచేయాలని చూసినా వారి తరం కాలేదు. దాంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడంతో వైరల్‌గా మారింది.