యుద్ధానికి సిద్ధం! | Yami Gautham new movie 'Yuddham' | Sakshi
Sakshi News home page

యుద్ధానికి సిద్ధం!

Published Wed, Feb 19 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM

యుద్ధానికి సిద్ధం!

యుద్ధానికి సిద్ధం!

‘విక్కీ డోనర్’లాంటి సినిమాతో బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్న యామి గౌతమ్ తెలుగులో రవిబాబు దర్శకత్వంలో ‘నువ్విలా’ చేసింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమా ‘యుద్ధం’. ఇందులో శ్రీహరి, తరుణ్ హీరోలుగా చేశారు. భారతీ గణేష్ దర్శకత్వంలో నట్టికుమార్-నట్టి లక్ష్మి నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ఆలస్యమైనప్పటికీ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని, శ్రీహరి, తరుణ్‌ల మధ్య సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని, ఈ నెల 26న పాటలను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘స్టూడెంట్ లీడర్‌గా తరుణ్, మాస్ లీడర్‌గా శ్రీహరి తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. పాటలతో పాటు పోరాట సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సమర్పణ: నట్టి క్రాంతి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement