ప్రేమలో మళ్లీ ఫెయిలైన హీరోయిన్ | Yet another failed love story of Nayanatara | Sakshi
Sakshi News home page

ప్రేమలో మళ్లీ ఫెయిలైన హీరోయిన్

Published Sun, Jun 12 2016 1:56 PM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

ప్రేమలో మళ్లీ ఫెయిలైన హీరోయిన్

ప్రేమలో మళ్లీ ఫెయిలైన హీరోయిన్

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార సినిమా విజయాలతో పాటు లవ్ ఎఫైర్స్లోనూ వార్తల్లో ఉంటుంది. గతంలో ప్రేమలో విఫలమైన నయనతారకు మరోసారి చేదు అనుభవం ఎదురైందట.

తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్తో నయనతార ప్రేమలో పడినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అంతేగాక నయన కోసం విఘ్నేష్ మతం మార్చుకున్నాడని, వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని కూడా రూమర్స్ వచ్చాయి. ఏమైందో కానీ వీరిద్దరి బంధం చెడిందని, గతంలో మాదిరిగా నయనతార ప్రేమకథ మరోసారి విఫలమైనట్టు సినీ వర్గాల సమాచారం.

నయనతార గతంలో కొంతమంది హీరోలతో ప్రేమాయణం సాగించింది. శింబుతో ఆ తర్వాత ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. వీరిద్దరితోనూ ప్రేమ పెళ్లి వరకు వెళ్లినా కార్యరూపం దాల్చలేదు. పాపం నయనకు మరోసారి అలాంటి అనుభవమే ఎదురైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement