బోర్డర్‌లో యుద్ధం | Yuddha Bhoomi Theatrical Trailer | Sakshi
Sakshi News home page

బోర్డర్‌లో యుద్ధం

Jun 7 2018 12:15 AM | Updated on Jun 7 2018 12:15 AM

Yuddha Bhoomi Theatrical Trailer - Sakshi

అల్లు శిరీష్‌

భారత సరిహద్దుల్లో 1971లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘1971 బియాండ్‌ బార్డర్స్‌’. మేజర్‌ రవి దర్శకత్వం వహించారు. గత ఏడాది మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఏయన్‌ బాలాజి ‘యుద్ధభూమి’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. ఏయన్‌ బాలాజి మాట్లాడుతూ – ‘‘ఈ చిత్ర దర్శకుడు రవిగారు నిజ జీవితంలో కూడా మేజర్‌ కావడం విశేషం. ఆయన 1981లో ఆర్మీలో చేరి అనేక కీలక ఆపరేషన్స్‌ లీడ్‌ చేసారు.

ఆ ఆపరేషన్స్‌కి సంబంధించిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1971లో భారత్‌ –పాక్‌ బోర్డర్‌లో జరిగిన యుద్ధం నేపథ్యంలో ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. మేజర్‌గా మోహన్‌లాల్, ఎనర్జిటిక్‌ అండ్‌ యంగ్‌ డైనమిక్‌ సోల్జర్‌గా అల్లు శిరీష్‌ కనిపిస్తారు. నేను రిలీజ్‌ చేసిన గత సినిమాల్లాగే ఈ చిత్రం కూడా సక్సెస్‌  సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్ద్‌ విపిన్, కెమెరా: సుజిత్‌ వాసుదేవ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement