నరేంద్ర మోడీ పాట్నా సభకు 11 ప్రత్యేక రైళ్లు | 11 trains ready to bring supporters for Narendra Modi meeting at Patna | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోడీ పాట్నా సభకు 11 ప్రత్యేక రైళ్లు

Published Sun, Oct 20 2013 10:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

నరేంద్ర మోడీ పాట్నా సభకు 11 ప్రత్యేక రైళ్లు - Sakshi

నరేంద్ర మోడీ పాట్నా సభకు 11 ప్రత్యేక రైళ్లు

బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. తనను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి బయటకెళ్లిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వరాష్ట్రంలో మోడీ పర్యటించబోతున్నారు. ఈ నెల 27న పాట్నాలో జరిగే సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. 11 ప్రత్యేక రైళ్ల ద్వారా జనాన్నితరలించనున్నారు.

రైళ్లను ఇప్పటికే రిజర్వేషన్ చేయించినట్టు బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ తెలిపారు. స్టేజీపై వెనుక భాగంలో 30 అడుగుల డైనమిక్ స్క్రీన్ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. బీహార్ రాష్ట్ర విశేషాలు, చరిత్రాత్మక ప్రదేశాలు, జాతీయ స్థాయి నాయకుల చిత్రాల్ని స్క్రీన్పై ప్రదర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement