మణిపూర్ సీఎం ఇంటివద్ద బాంబు పేలుడు | 2 killed, 7 injured in bomb blast near Manipur CM's residence in Imphal | Sakshi
Sakshi News home page

మణిపూర్ సీఎం ఇంటివద్ద బాంబు పేలుడు

Published Thu, Oct 31 2013 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM

2 killed, 7 injured in bomb blast near Manipur CM's residence in Imphal

ఇంఫాల్: మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో ఉగ్రవాదులు బుధవారం రెండు శక్తిమంతమైన బాంబులు పేల్చడంతో ఇద్దరు పౌరులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఉదయం 6.20 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్ అధికారిక కార్యాలయం-నివాసం వద్ద నిలిచిన ఓ స్కూలు బస్సులో మొదటి ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని మోయిదాంగ్‌పోక్ ప్రాంతంలో భద్రతా దళాలు పెట్రోలింగ్ జరుపుతున్న చోట మరో బాంబు పేల్చారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. ఉగ్రవాదుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement