'2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం'
కమల్ పూర్: ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ లో విస్తృతంగా ప్రచారం చేసినా బీజేపీ విజయం దక్కలేదని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. మోదీ 30 ఎన్నికల సభల్లో పాల్గొన్నారని, ప్రజలు ఆయన చెప్పిందతా విని తమ ఓట్లు ద్వారా తీర్పు వెలువరించారని చెప్పారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కమల్ పూర్ లో జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
ఛత్తీస్ గఢ్ సీఎం తనయుడు బ్లాక్ మనీ కలిగివున్నాడని ఆరోపణలు వచ్చినా మోదీ స్పందించలేదని విమర్శించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదని దుయ్యబట్టారు. ఈ ధనమంతా ప్రభుత్వ ఖజానాలో ములుగుతోందని తెలిపారు.
అసోంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారం కట్టబడితే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీయిచ్చారు. 2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. సంవత్సరాదాయం రూ.2 లక్షల్లోపు ఉన్నవారికి ఉచిత వైద్యం అందిస్తామని మాటయిచ్చారు.