
వాళ్లను ఉరి తీయాల్సిందే: దేవిక
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 26/11 మారణోమానికి కారకులైన కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని బాధితుల్లో ఒకరైన దేవిక రొతవాన్ విజ్ఞప్తి చేశారు. చేశారు. దాడులకు కుట్రపన్నిన రాక్షసులను ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. మరణశిక్ష అమలు చేయాలని స్పష్టం చేసింది.
26/11 దాడి నుంచి దేవిక ప్రాణాలతో బయటపడింది. ముష్కరులు పేల్చిన తుపాకీ తూటా తగలడంతో ఆమె గాయపడింది. తర్వాత కోలుకుంది. ముంబై ఉగ్రదాడుల కేసులో అప్రూవర్‌గా మారి ముంబై కోర్టుకు వాంగ్మూలం ఇస్తున్న డేవిడ్ హెడ్లీని కూడా ఉరితీయాల్సిందేనని దేవిక డిమాండ్ చేసింది. ఐపీఎస్ ఉద్యోగంలో చేరాలన్నదే తన లక్ష్యమని వెల్లడించింది.