సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా రక్కసి విజృంభిస్తోంది. పది రోజుల క్రితమే రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి మూడు లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 11,458 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్ బారినపడి 386 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,993కి చేరింది. మృత్యుల సంఖ్య 8884కి పెరిగింది. ఇప్పటి వరకు 1,54,330 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్‌లో 1,45,779 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీలో వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది. లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చిన అనంతరం కోవిడ్ విజృంభణ ఉధృతంగా మారింది. (గ్రహణ శక్తిని కోల్పోతే కరోనా టెస్ట్)
శనివారం నాటికి రాష్ట్రాల వారిగా..
- మహారాష్ట్రలో మొత్తం 1,01,141 కరోనా కేసులు, 3,717మరణాలు
- తమిళనాడులో 40,698 పాజిటివ్ కేసులు, 367 మంది మృతి
- ఢిల్లీలో 36,824 కరోనా కేసులు, 1,214 మంది మృతి
- గుజరాత్‌లో 22,562 పాజిటివ్ కేసులు, 1,416 మంది మృత
- ఉత్తరప్రదేశ్‌లో 12,616 పాజిటివ్ కేసులు, 365 మంది మృతి
- రాజస్థాన్‌లో 12,068 పాజిటివ్ కేసులు, 272 మంది మృతి
- మధ్యప్రదేశ్‌లో 10,443 పాజిటివ్ కేసులు, 440 మంది మృతి
- పశ్చిమబెంగాల్‌లో 10,244 పాజిటివ్ కేసులు, 451 మంది మృతి
- కర్ణాటకలో 6,516 పాజిటివ్ కేసులు, 79 మంది మృతి
- హర్యానాలో 6,334 పాజిటివ్ కేసులు, 70 మంది మృతి
- బిహార్‌లో 6,096 పాజిటివ్ కేసులు, 35 మంది మృతి
- జమ్మూకశ్మీర్‌లో 4,730 పాజిటివ్ కేసులు, 53 మంది మృతి
- అసోంలో 3,694 పాజిటివ్ కేసులు, ఎనిమిది మంది మృతి
- ఒడిశాలో 3,498 పాజిటివ్ కేసులు, 13 మంది మృతి
- పంజాబ్‌లో 2,986 పాజిటివ్ కేసులు, 63 మంది మృతి
- కేరళలో 2,323 పాజిటివ్ కేసులు, 20 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment