
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం, పౌరులు ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడంలేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,983 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ బారినపడి 206 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,56,611కు చేరింది. ఇక మొత్తం మృతుల సంఖ్య 7,135కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,25,381 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,24,095 మంది డిశ్చార్జ్ అయ్యారు. జూన్ 7 నాటికి దేశంలో 47,74,434 కరోనా టెస్టుల నిర్వహించారు. ఈమేరకు సోమవారం ఉదయం కేంద్రవైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. (కరోనా పోరులో విజయం: సంబరపడొద్దు)
Comments
Please login to add a commentAdd a comment