పట్నా: కరోనా నేపథ్యంలో వైద్యులు చికిత్సకు నిరాకరించడంతో బిహార్‌లో ఓ చిన్నారి (3) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జనాబాద్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. తీవ్ర అస్వస్థతకు గురైన తమ కొడుకును తీసుకుని తల్లిదండ్రులు జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. అయితే, అక్కడ కరోనా పేషంట్లకు చికిత్స జరగుతుండంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు రిఫర్ చేశారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో ఆక్సిజన్ పెట్టుకుని తీసుకెళ్లాలని సూచించారు. అయితే, సమయానికి అంబులెన్స్ ఏర్పాటు చేయడంలో ఆస్పత్రి యాజమాన్యం విఫలమైందని చిన్నారి తండ్రి ఆరోపించాడు.
(చదవండి: రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం)
ఇక దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో రవాణా స్తంభించి పోవడంతో దిక్కుతోచని స్థితిలో బాలుడిని మోసుకుని తల్లిదండ్రులు రోడ్డు వెంట పరుగులు పెట్టారు. చికిత్స అందకపోవడంతో తల్లి చేతుల్లోనే చిన్నారి ప్రాణాలు విడిచాడు. అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతోనే తమ కుమారుడు మరణించాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు రోధిస్తున్న వీడియో హృదయ విదారకంగా ఉంది. ఇక ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ నవీన్ కుమార్‌ను వివరణ కోరగా.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆస్పత్రి మేనేజర్‌ను విచారిస్తానని చెప్పారు.
(చదవండి: భారత్‌లో 7447 కేసులు.. 239 మరణాలు)
Comments
Please login to add a commentAdd a comment