కలుషిత నీరు తాగి ఒడిశాలోని 40 మంది పోలీసులు కామెర్ల బారిన పడ్డారు. వీరిలో ఐదుగురు కోలుకుని విధుల్లో చేరగా మరో 35 మంది చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అక్కడి పోలీసు అధికారి ఆర్పీ శర్మ స్పందిస్తూ 350 మంది మాత్రమే ఉండగల పోలీసు నివాసాల్లో దాదాపు వెయ్యిమందికి పైగా ఉంటున్నారని, వీరంతా కేవలం 30 మరుగుదొడ్లనే ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. దీని కారణంగా అక్కడి వాతావరణమంతా కలుషితంగా మారి తాగునీరు దాని భారిన పడి ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేక వైద్యుల బృందం పోలీసులు ఉంటున్న నివాసాలను సందర్శించి అక్కడి పరిశుభ్రత అద్వాన్నంగా ఉందని తేల్చంది.