హైదరాబాద్లో ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్ | 6 suspected ISIS sympathsiers arrested in Karnataka | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్

Published Fri, Jan 22 2016 12:20 PM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

హైదరాబాద్లో ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్ - Sakshi

హైదరాబాద్లో ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్

ఒకే రోజు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏడుగురు ఐసిస్ సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకొని కుట్రలు చేస్తున్న వీరి ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్లో నలుగురు ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అధికారులు తమ అధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరోవైపు కర్ణాటక పోలీసులు, ఎన్ఐఏ అధికారుల జాయింట్ ఆపరేషన్లో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను శుక్రవారం ఉదయం బెంగళూరులో అరెస్ట్ చేశారు. నజ్ముల్ హుడా, హస్సేన్లను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. నజ్ముల్, హస్సేన్  కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు కొన్ని రోజులు వీరిద్దరిపై నిఘా ఉంచారు.

 

రిపబ్లిక్ వేడుకల్లో దాడులు చేసేందుకు కుట్రపన్నుతున్నారన్న అనుమానంతో వీరిని తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బజ్పేలో నివాసముంటున్న నజ్ముల్ హుడా-మంగళూర్లో కెమికల్  ఇంజినీరింగ్, తుంకుర్కు చెందిన సయ్యద్ హుస్సేన్- బెంగళూరులో డిప్లొమా చేస్తున్నారు. మహారాష్ట్రలోనూ ఒక ఐసిస్ సానుభూతి పరుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని మంబై ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement