బ్యాంకింగ్‌ ఆన్‌లైన్‌పై షాకింగ్‌ న్యూస్‌! | A 22 Year Old Hacks Bank Site In Three Hours From A Gurugram | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌ ఆన్‌లైన్‌పై షాకింగ్‌ న్యూస్‌!

Published Fri, Dec 30 2016 9:13 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

బ్యాంకింగ్‌ ఆన్‌లైన్‌పై షాకింగ్‌ న్యూస్‌!

బ్యాంకింగ్‌ ఆన్‌లైన్‌పై షాకింగ్‌ న్యూస్‌!

న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ప్రజలంతా ఆన్‌లైన్‌ బాటపట్టాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. డబ్బు సంగతి మర్చిపోయి అందరూ నగదు రహిత లావాదేవీలను ఉద్యమ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని కోరుతోంది. అయితే, అంతకుముందు ఈ ఆన్‌లైన్‌ వ్యవస్థ ఎంతవరకు భద్రం? బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బుకు భద్రత ఉందా? అసలు బ్యాంకులు సైతం తమ వెబ్‌సైట్ల విషయంలో భవిష్యత్తుల్లో ఎలాంటి ప్రమాదానికి గురవకుండా చర్యలు తీసుకున్నాయా? సైబర్‌ దొంగల బారినపడనంత భద్రంగా బ్యాంకులు ఉన్నాయా? అంటే అస్సలు లేవని ఈ విషయం నిరూపిస్తోంది.

ఎందుకంటే బ్యాంకుల సైట్లు హ్యాకింగ్‌ గురయ్యేందుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని కొంతమంది ఎథికల్‌ హ్యాకర్లు ప్రూవ్‌ చేశారు. కేవలం మూడు గంటల్లో ఓ బ్యాంకు సైట్‌ను వారు హ్యాక్‌ చేసి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. గుర్గావ్‌లో ఓ ఎథికల్‌ హ్యాకింగ్‌ సంస్థ ఉంది. ఇది ఆయా కంపెనీలకు వచ్చే హ్యాకింగ్‌ సమస్యలు, ఇతర సాఫ్ట్‌వేర్‌ సమస్యలు చూస్తుంటుంది. ఈ కంపెనీ ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల ఆన్‌లైన్‌ లావాదేవీలు ఎంతమేరకు భద్రం అనే విషయాన్ని పరీక్షించింది. అందులో భాగంగా ఐదుగురు ఎథికల్‌ హ్యాకర్లతో ఈ పరీక్ష చేయించింది. వీరిలో హ్యారీ (హర్జిత్‌) అనే ఎథికల్‌ హ్యాకర్‌ ఓ బ్యాంకును హ్యాక్‌ చేశాడు. ఆ బ్యాంకు సంబంధించిన రూటర్‌ను మూడు గంటల్లో తన ఆదీనంలోకి తెచ్చుకున్నాడు.

'బ్యాంకు ఖాతాదారులు చేసే ఆన్‌లైన్‌ లావాదేవీలకు స్పందించేది రూటరే. ఖాతాదారుల విజ్ఞప్తులను రూటరే బ్యాంకు సంస్థకు ఆదేశిస్తుంది. అంటే లావాదేవీని ముందుకు తీసుకెళుతుంటుంది. నేను హ్యాక్‌ చేయడం ద్వారా ఆ రూటర్‌ పాస్‌ వర్డు తెలుసుకోగలిగాను. దానిని ఇష్టం వచ్చినట్లుగా నేను నియంత్రించగలను. ప్రతి ఖాతాదారుడి రిక్వెస్ట్‌ను ఇతర ప్రైవేట్‌ సైట్‌కు కేటాయించి వారి ద్వారా లోగిన్‌ పాస్‌వర్డ్‌ అడిగి అన్నింటిని తెలుసుకోగలను. దీంతో ఆ బ్యాంకుకు సంబంధించిన ఖాతాదారుల సొమ్మంతా నేను కొల్లగొట్టొచ్చు' అని హ్యారీ చెప్పాడు. అయితే, ఇలా చేయడం తన ఉద్దేశం కాదని, మన బ్యాంకింగ్‌ ఆన్‌లైన్‌ విధానం ఎంత బలహీనంగా ఉందో చెప్పేందుకే ఇలా చేశామని, ఇలా చెప్పడం ఎథికల్‌ హ్యాకర్లుగా తమ బాధ్యత అని కూడా అతడు అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement