సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత కూడా దాదాపు నాలుగు నెలలుగా అధికార నివాసంలోనే ఉం టోన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ అద్దె ఇంటి వేటలో పడ్డారు. అయితే ఢిల్లీలో తనకు నచ్చిన ఇల్లు అద్దెకు దొరకడం ఆయనకు పెద్ద కష్టంగా మారింది. ప్రస్తుతం ఆయన నివాసముం టున్న తిలక్‌లేన్‌లోని ప్రభుత్వ నివాసాన్ని జూన్ 30లోగా ఖాళీ చేయవలసి ఉంది. ఈలోగా అద్దె ఇంటికి మారాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.
మయూర్ విహార్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకోవాలని ఇంటి యజమానులతో మాట్లాడారు కూడా. అయితే మొదట ఇంటిని అద్దెకివ్వడానికి అంగీకరించిన యజమాని మంగళవారం మాటమార్చారు. కేజ్రీవాల్‌కు ఇంటిని అద్దెకు ఇవ్వడానికి నిరాకరించారు. ఇరుగుపొరుగున నివ సించే వారు అభ్యంతరాలు వ్యక్తం చేయడం వల్ల ఇంటి యజమాని కేజ్రీవాల్‌కు ఇల్లు ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. కేజ్రీవాల్ నివాసముండడం వల్ల పరిసర ప్రాంతాలలో ప్రశాంతత లోపిస్తుందని, ఆయనను కలవడానికి వచ్చే జనా ల కారణంగా కాలనీవాసులకు ఇబ్బంది ఎదురవుతుందని వారు భావించారని అంటున్నారు.
తన కుటుంబంతో నివసించడానికి అనువుగా ఉండడంతో పాటు పార్టీ కార్యాలయం నడపడానికి కూడా వీలుగా ఉండే ఇంటి కోసం కేజ్రీవాల్ అన్వేషిస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన మయూర్ విహార్, జంగ్‌పురా, మహా రాణి బాగ్, రాజేంద్ర నగర్, మోడల్ టౌన్, పటేల్ నగర్, గ్రీన్‌పార్క్, హౌజ్ ఖాస్, గ్రేటర్ కైలాష్, న్యూఫ్రెండ్స్ కాలనీ వంటి పోష్ ఏరియాల్లో ఇంటి కోసం వెదికారు, మయూర్ విహార్ ఇల్లు ఆయనకు నచ్చింది. కానీ ఇంటి యజమాని నిరాకరణతో ప్రయత్నం మళ్లీ మొదటికొచ్చింది.
అద్దె ఇంటి వేటలో కేజ్రీవాల్ కష్టాలు
Published Thu, Jun 19 2014 10:20 PM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM
Advertisement