‘సంక్షేమ పథకాలకు ఆధార్‌ తప్పనిసరి కాదు’ | Aadhaar is not mandatory to the welfare schemes | Sakshi
Sakshi News home page

‘సంక్షేమ పథకాలకు ఆధార్‌ తప్పనిసరి కాదు’

Published Wed, Mar 29 2017 6:31 AM | Last Updated on Sat, Oct 20 2018 5:49 PM

‘సంక్షేమ పథకాలకు ఆధార్‌ తప్పనిసరి కాదు’ - Sakshi

‘సంక్షేమ పథకాలకు ఆధార్‌ తప్పనిసరి కాదు’

న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను పొందేందుకు ఆధార్‌ కార్డు కలిగి ఉండటం తప్పనిసరి కాదనీ, ప్రభుత్వాలు జారీ చేసిన ఇతర ఏ గుర్తింపు కార్డు ఉన్నా చాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మంగళవారం చెప్పారు. ఇదే విషయాన్ని సోమవారమే సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేయడం తెలిసిందే. ‘ఆధార్‌ తప్పనిసరేం కాదు. ఆధార్‌ లేనంత మాత్రాన ఏ వ్యక్తికీ సంక్షేమ ఫలాలను నిరాకరించలేం’అని రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.

1 నుంచి నీతి ఆయోగ్‌ త్రైవార్షిక ప్రణాళిక
నీతి ఆయోగ్‌ కొత్తగా తీసుకురానున్న మూడేళ్ల కార్యాచరణ ప్రణాళికను ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో (మార్చి 31తో) 12వ పంచవర్ష ప్రణాళిక ముగుస్తుండటంతో ఏప్రిల్‌ 1 నుంచే కొత్త ప్రణాళికను అమలు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement