పోటికి సిద్దమైతే, మేధా పాట్కర్ కు పూర్తి మద్దతు: ఆప్
లోకసభ ఎన్నికల్లో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పోటికి సిద్దమైతే పూర్తిస్థాయిలో తాము మద్దతిస్తాం అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అయితే పోటీ చేయాలో వద్దో మేధా పాట్కర్ నిర్ణయం తీసుకోవాలని ఆప్ పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ నేత సంజయ్ సింగ్ తెలిపారు.
ఒకవేళ పాట్కర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా.. పూర్తి సహకారం అందిస్తామని సంజయ్ వెల్లడించారు. నర్మద బచావో ఆందోళన చేపట్టిన మేధా పాట్కర్ ఆప్ కు పూర్తి మద్దతు తెలిపిన సంగతి తెలిసింది.
ఈశాన్య ముంబై స్థానం నుంచి కాని, తాను ఉద్యమించిన ప్రాంతంలోని ఓ స్థానం నుంచి లోకసభ బరిలోకి దిగే అవకాశం ఉంది అని వార్తలు వెలువడుతున్నాయి. ఈశాన్య ముంబైలోని మురికి వాడల కూల్చివేతకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వంపై గతంలో పోరాటం చేశారు.